వ్యక్తి దారుణ హత్య..!
ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ధారూర్ మండల పరిధిలోని కుమ్మర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
దిశ, ప్రతినిధి వికారాబాద్ / ధారూర్ : ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ధారూర్ మండల పరిధిలోని కుమ్మర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారూర్ మండలం, కుమ్మరిపల్లి బాజ్యానాయక్ తండా గ్రామానికి చెందిన వర్త్య పండరి(34) హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ సబ్ - కాంట్రాక్టర్ గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం 11:40 గంటలకు తన భార్య దివ్యకు ఫోన్ చేసి ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. మధ్యాహ్నం 2:20 గంటలకు దివ్య భర్తకు ఫోన్ చేయగా ఇంటికి వచ్చాను మళ్లీ ఫోన్ చేస్తాని ఫోన్ కట్ చేశాడు. సాయంత్రం 7 గంటల సమయంలో ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని తెలిపారు.
ఆ సమయంలోనే దివ్య తోటి కోడలు అయినా అనూషకు బయటకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన పండరి తిరిగి రాలేదు. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గ్రామశివారులో కుమ్మరిపల్లి చెరువు అలుగు వైపు వాకింక్ కు వెళ్లిన కొందరు యువకులకు ర్తకపు మడుగులో ఉన్న పండరి మృతదేహం కనిపించింది. ఎవరో దారుణంగా హత్యా చేసినట్లు గుర్తించిన వారు మృతుడి సోదరుడు వర్త్య శ్రీనివాస్ కు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పండరి కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి భార్య వర్త్య దివ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధారూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.