ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాం

తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వం కృషి చేస్తుందని కర్ణాటక రాష్ట్ర వైద్య, విద్యాశాఖ మంత్రి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలు అన్నారు.

Update: 2024-11-23 14:21 GMT

దిశ, తాండూరు : తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వం కృషి చేస్తుందని కర్ణాటక రాష్ట్ర వైద్య, విద్యాశాఖ మంత్రి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం తాండూర్ ఎమ్మెల్యే సహకారంతో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవాంగ్గీ నుండి అల్లకోడ్ వరకు 1.15 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర వైద్య, విద్య శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ రుద్రప్ప పాటిల్ హాజరై.. ఎమ్మెల్యే తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ కాన్వాయ్ తో సరిహద్దు ప్రాంతంలో మంత్రి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వాగతం పలికారు.

పోతంగల్ లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రి సహాకారంతో సరిహద్దు ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. బషీరాబాద్ మండల సరిహద్దు గ్రామం అయిన మైల్వర్ నుంచి కర్ణాటకలో గల ఆడ్కే గ్రామానికి వరకు అనుసంధానం చేస్తూ రోడ్డుకు కర్ణాటక ప్రభుత్వం సహకరించాలని మంత్రి కోరారు.సేడం నుంచి తాండూరు వరకు బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ రోడ్ పనులు పూర్తయ్యాక అది జెట్టుర్,పోతంగల్ ,బషీరాబాద్ మీదుగా తాండూరు కు వచ్చేట్టు చూడాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

తాను ఎమ్మెల్యే గెలవడానికి శరన్ ప్రకాష్ పటేల్ తాండూరు లో కృషి చేయడం జరుగిందని సభలో గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రాంతాలతో పాటు తాండూరు అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి శరణ్ ప్రకాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రాంరెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ రెడ్డి, వైస్ చైర్మన్ చందర్ నాయక్, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ రాము నాయక్,కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కాలాల్ నర్సిములు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు, సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ , బిచ్చిరెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News