శంషాబాద్‌లో ఉద్రిక్తత.. పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తోపులాట
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ప్రైవేట్ హోటల్లో బీజేపీ నాయకుల
దిశ,శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ప్రైవేట్ హోటల్లో బీజేపీ నాయకుల పార్టీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఆరాంఘర్ వద్ద ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి తో పాటు మరి కొంతమంది బీజేపీ నాయకులు వెళ్లడానికి వెళుతుండగా హోటల్ వద్ద శంషాబాద్ పోలీసులు బార్ గేట్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. పోలీసులతో బీజేపీ నాయకులు వాగ్వివాదం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సమావేశానికి వెళ్లేందుకు వెళ్తుండగా పోలీసులు శంషాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ బాలరాజు, నరేందర్ రెడ్డి తో పాటు భారీ పోలీసులు బందోబస్తుతో అడ్డుకోవడంతో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తోపులాట ఉధృత పరిస్థితి నెలకొంది. దీంతో ఏసీపీ శ్రీనివాసరావు కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వివాదం చేసుకుంది.
నువ్వు నన్నే అడ్డుకుంటావా నన్నే తోసుతావా అంటూ ఏసీపీ శ్రీనివాసరావు కార్పొరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి వెళుతుంటే అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ బిజెపి నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలకకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మీరు అడ్డుకున్న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి వెళ్లి తీరుతామంటూ భీష్మించుకు కూర్చున్నారు. మా ప్రాంతంలో ప్లై ఓవర్ ప్రారంభోత్సవం జరుగుతుంటే అడ్డుకోవడానికి మీరు ఎవరు అంటూ మీ దగ్గర పర్మిషన్ ఎందుకు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆరాంఘర్ చౌరస్తా నుండి జూ పార్క్ వరకు కేంద్ర ప్రభుత్వం నిధులతో నాలుగు కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ పనులు పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధం అయిన సందర్భంలో ఎంఐఎం పార్టీ వ్యక్తులు ఎంఐఎం పార్టీ నాయకులు ఎంఐఎం పార్టీ కార్యక్రమంలా ఎంఐఎం జెండాలు, ప్లెక్సీలు వేస్తున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం తొత్తుల మారారు అన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు.
తన కార్పొరేషన్ పరిధిలో ఉందని తనకు ప్రభుత్వం ద్వారా ఇన్విటేషన్ ఉన్న పోలీసులు కావాలనే తనను అడ్డుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా పోలీసులు నిజా నిజాలు తెలుసుకొని వ్యవహరిస్తే మంచిది అన్నారు. ఒక ప్రజా ప్రతినిధి నుంచి చూసి చూడకుండా పోలీసులు తోయడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, జూదం విచ్చలవిడిగా నడుస్తుంటే పోలీసులు మాత్రం ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ అడ్డుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఎవరికి శాశ్వతం కాదని ప్రభుత్వానికి వత్తాసు పలికి పోలీసులు తమ విధులను మరచిపోయి వ్యవహరిస్తున్నారన్నారు తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వరి మాజీ ఎమ్మెల్యే కేస్ రత్నం, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రేమ్ రాజ్, పంతంగి రాజభూపాల్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్, బుక్క వేణుగోపాల్, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి నాయకులు శ్రీధర్, మల్లారెడ్డి, మల్లేష్ యాదవ్, కొమురయ్య, దేవేందర్, భీమార్జున రెడ్డి, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.