అవినీతికి నిలయంగా తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం..

ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. రిజిస్ట్రేషన్లు చేయడానికి అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నా అమ్యామ్యాల కోసం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన తాండూరు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయం తీరు,

Update: 2024-10-20 13:03 GMT

దిశ, తాండూరు: ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. రిజిస్ట్రేషన్లు చేయడానికి అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నా అమ్యామ్యాల కోసం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన తాండూరు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయం తీరు, గతంలో తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి సబ్ రిజిస్ట్రార్ సమీరుద్దీన్‌తోపాటు డాక్యుమెంట్ రైటర్‌ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని జైలుకు తరలించారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే, అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్స్‌, రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కూడా ఇక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇటువంటి భూములను రిజిస్ట్రేషన్‌ చేయడానికి లక్షల్లో వసూళ్లు చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటుంటే, తప్పుడు పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కార్యాల‌యంలో రైట‌ర్ల హ‌వా..!

తాండూరు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో ప్రైవేటు వ్య‌క్తులు హ‌ల్చల్ చేస్తున్నారు. అధికారుల క్యాబిన్ల‌లో కూర్చుంటూ రేట్లు ఫిక్స్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. కార్యాల‌యంలో అధికారుల‌కన్నా.. రైట‌ర్ల హ‌డావుడే ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌టం విశేషం. రిజిస్టేషన్​ కార్యాలయం సమీపంలో అనధికారికంగా ఆఫీసులను ఏర్పాటు చేసుకున్న కొంత‌మంది రైట‌ర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కొనుగోలు, అమ్మకందారుల డాక్యుమెంట్లను రెడీ చేయాల్సిన రైటర్లు సబ్​ రిజిస్ట్రార్​ సిబ్బందికి అదనపు ఆదాయ వనరుగా మారారు. అక్రమాలు బయట పడకుండా, సిబ్బంది తప్పులు ఎవరికీ కనపడకుండా చూడడంలో వీరే అధికారుల‌కు అన్ని విధాలుగా ర‌క్ష‌ణ‌గా ఉంటున్న‌ట్లు స‌మాచారం. వారిని కాద‌ని నేరుగా కార్యాల‌యంలో అధికారుల‌ను సంప్ర‌దించినా ప‌నులు కావ‌ని, ఫైళ్లు క‌ద‌ల‌వ‌ని కొంత‌మంద అనుభ‌వ‌పూర్వ‌కంగా చెబుతుండ‌టం గ‌మనార్హం. అధికారులు కొర్రీలు పెడుతూ పార్టీలను తిప్పించుకుంటారు. ఎల్ఆర్‌ఎస్‌ల వ్యవహారంపై దృష్టి సారించాల్సిన జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు వారి వారి కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. గతంలో తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి సబ్ రిజిస్ట్రార్ సమీరుద్దీన్‌తోపాటు డాక్యుమెంట్ రైటర్‌ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని జైలుకు తరలించిన ఘటన అందరికీ తెలిసిందే. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

ప్రతి పనికీ ఓ రేటు..

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటును ఫిక్స్‌ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. భూములు, ఇతర ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు మార్కెట్‌ వాల్యుపైన సేల్‌ డీడ్‌ అయితే స్టాంపు డ్యూటీ 4శాతం, ట్రాన్స్ ఫర్‌ డ్యూటీ సుంకం 1.5శాతం, రిజిస్ట్రేషన్‌ చార్జీలు 0.5చొప్పున మొత్తం 6శాతం చార్జీలు చెల్లించాలి. అదే గిఫ్ట్‌ డీడ్‌ అయితే స్టాంపు డ్యూటీ 1శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 0.5శాతం, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5చొప్పున కనీసం రూ.1000, గరిష్టంగా రూ.10వేలు చెల్లించాలి. పై చార్జీలు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉండగా ఒక్కో డాక్యుమెంట్‌పై రూ.1000వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. నిబంధనల మేరకు లొసుగులు ఉన్న పక్షంలో కనీసం రూ.3 వేల నుంచి గరిష్టంగా రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

పేరుకే సిటిజన్‌ చార్టర్‌..

తాండూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం గోడలకు సిటిజన్‌ చార్టు బోర్డులు అతికించారు. అందులో పేర్కొన్న విధంగా సమయపాలన పాటించకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. సిటిజన్‌ చార్టర్‌ లో ఒక్కో పనికి ఎంత సమయం పడుతుందనేది స్పష్టంగా పేర్కొన్నారు. భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు గరిష్టంగా 24 గంటల సమయం పడుతుండగా, కంప్యూటరైజ్డ్‌ ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) జారీకి గంట, అలాగే ఈసీ నకలు మ్యానువల్‌గా ఇచ్చేందుకు 24 గంట లు, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు గంట, పెండింగ్‌ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు ఒక రోజు, పెండింగ్‌ డాక్యుమెంట్లు సెక్షన్‌ 47-ఏ కింద జారీ చేసేందుకు 7 రోజులు, భూముల మార్కెట్‌ వాల్యువేషన్‌ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు గంట సమయం కేటాయిస్తూ సిటిజన్‌ చార్టులో పేర్కొన్నారు. అయితే ఇవ్వన్ని నామమాత్రమే. అదనంగా ముడుపులు చెల్లిస్తేనే పనులు జరుగుతాయి. లేకుంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే.


Similar News