దిక్కుమాలిన పాలనకు ఇదే నిదర్శనం..
ప్రజాసమస్యలు పరిష్కరించడంలో అభివృద్ధి సంక్షేమాల్లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని గ్రామాలలో ఉన్నసమస్యలను చూస్తే వీరి దిక్కుమాలిన పాలనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి, శంకర్ విమర్శించారు.
దిశ, చౌదరిగూడ : ప్రజాసమస్యలు పరిష్కరించడంలో అభివృద్ధి సంక్షేమాల్లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని గ్రామాలలో ఉన్నసమస్యలను చూస్తే వీరి దిక్కుమాలిన పాలనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి, శంకర్ విమర్శించారు. చౌదరి గూడ మండలంలోని రావిర్యాల, వీరసముద్రం గ్రామాలలో మండల అధ్యక్షుడు చలివేంద్రంపల్లి, రాజు ఆధ్వర్యంలో హాథ్ సే హాథ్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ప్రజలవద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే తరిమికొట్టాలని ప్రజలకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీ కష్టాలను తీర్చడానికి నేనున్నానని భరోసానిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో రాష్ట్రంలో నిరుపేద వర్గాలకు సంక్షేమ పాలన సాధ్యమని కావున రాహుల్ గాంధీ భారత్ జోడోస్ఫూర్తితో దేశాన్ని ఏకతాటి పై తెచ్చేందుకు హాథ్ సే హాథ్ పాదయాత్రతో ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాబర్ ఖాన్, శ్రీకాంత్ రెడ్డి, జాకారం చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, సలీం, యాదయ్య, లక్ష్మీ సుధా, శివకుమార్, గోపాల్, ఆయా గ్రామాల నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.