తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలి : ప్రిన్సిపల్ శోభారాణి
తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కాలేజ్ శంకరపల్లిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల అయిందని ప్రిన్సిపల్ శోభారాణి ఒక ప్రకటనలో తెలిపారు.
దిశ, శంకర్ పల్లి : తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కాలేజ్ శంకరపల్లిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల అయిందని ప్రిన్సిపల్ శోభారాణి ఒక ప్రకటనలో తెలిపారు. 2025- 26 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆన్లైన్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. జనవరి 6వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఆరవ తరగతిలో చేరే వారు కొత్తగా ప్రవేశాలు కల్పించడంతోపాటు ఏడు నుంచి పది తరగతుల్లోని ఖాళీ సీట్ల ప్రకారంగా ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల కోసం htpp://telanganaams.cgg . gov ఇం వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలని, జనవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవాలన్నారు. ప్రవేశాల కోసం ఓ. సి విద్యార్థులు రూ. 200 బీ. సి, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ ఈ డబ్ల్యూ ఎస్ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రాత పరీక్ష 13 ఏప్రిల్ 2025 జరుగుతుందని తెలిపారు.ఏప్రిల్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.