పేరుకే పరిమితమైన క్రీడా ప్రాంగణాలు

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో యువతను

Update: 2024-10-07 11:07 GMT

దిశ,మర్పల్లి : తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంతో దమస్తపూర్, పట్లుర్ కల్కొడ, రవులపాల్లి, తో పాటు పలు గ్రామాల్లో కూడా క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితమై,ఏర్పాటు చేసిన నాటినుండి నేటి వరకు నిరుపయోగంగానే ఉన్నాయని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను బలోపేతం చేసేందుకు వారు ప్రాక్టీస్ చేసేందుకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి గాలికి వదిలేసింది.

ఆటలకు ఉపయోగపడే విధంగా లేకపోవడంతో ఆటలు ఆడుకోలేకపోతున్నామని,ఈ క్రీడా ప్రాంగణాలు రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల్ని పోత్సాహించాలంటే ఆ గ్రామంలో ఉన్న గ్రౌండ్‌లను శుభ్రపరచాల్సిన పరిస్థితి ఉంది. కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్కూల్‌ గ్రౌండ్‌లను క్రీడా ప్రాంగణాలుగా మార్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం గత సర్కారు చేసిన తప్పిదాలు చేయకుండా గ్రామీణ ప్రాంతాల చివరన ఏర్పాటు చేసిన గ్రౌండ్‌లను సౌకర్యాలు మెరుగుపరిచి అందుబాటులోకి తేవాలి క్రీడాకారులు కోరుతున్నారు.


Similar News