టైంపాస్ చేసే ఎమ్మెల్యే మాకు అవసరం లేదు..! (వీడియో)
గ్రామాన్ని అభివృద్ధి చేయడం మరిచి రూపాయి నిధులు కేటాయించకుండా, మీతో నేను అంటూ గ్రామాలలో...Special News
దిశ, మర్పల్లి: గ్రామాన్ని అభివృద్ధి చేయడం మరిచి రూపాయి నిధులు కేటాయించకుండా, మీతో నేను అంటూ గ్రామాలలో టైంపాస్ చేస్తూ ప్రజాదానాన్ని, పోలీసులు, అధికారుల సమయాన్ని వృథా చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మా గ్రామంలోకి రావడానికి వీల్లేదని మంగళవారం ఉదయం బంటారం మండలం, తొర్ మామిడి గ్రామానికి చెందిన ప్రజలు, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ముందస్తుగా బంటారం పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.ఈ అరెస్టు జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ గెలిచి నాలుగు ఏళ్లు అవుతున్నా, మా గ్రామానికి కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చాడని, మొదటిసారి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని, దళిత బంధు కూడా ధనవంతులైన బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చాడు తప్ప అర్హులైనవారిని గుర్తించి ఇవ్వలేదు.. గ్రామంలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది.. గ్రామంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ని కూడా నడిపించలేని చేతగానీ ఎమ్మెల్యే ఏ మొహం పెట్టుకుని గ్రామానికి వస్తాడని కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు నిలదీశారు. ఎమ్మెల్యే వచ్చే రోడ్డును బ్లాక్ చేసిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు బూతులు మాట్లాడి దాడి చేసినట్లు చెబుతున్నారు.ఇంత జరిగినా కూడా అధికార పార్టీ నేతలకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్న పోలీసులు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ నిలదీస్తున్నారు. అరెస్టు చేసినవారిలో కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు వీరేశం, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇసాక్, వర్కింగ్ ప్రెసిడెంట్ యూసుఫ్, అరుణ్, నరేష్, యాకుబ్ బీఎస్పీ పార్టీ ప్రెసిడెంట్ బాబా తదితరులు ఉన్నారు.