మొదలైన డేటా ఎంట్రీ నమోదు ప్రక్రియ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో సేకరించిన వివరాల నమోదు ప్రక్రియ మొదలైందని మండల పరిషత్ కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
దిశ,కొత్తూర్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో సేకరించిన వివరాల నమోదు ప్రక్రియ మొదలైందని మండల పరిషత్ కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో 15 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తో వివరాలను సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి అరుంధతి, మండల పంచాయతీ అధికారి విజయలక్ష్మి పర్యవేక్షణలో డేటా ఎంట్రీ పనులు ప్రారంభమైనట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు.
సర్వే వివరాలు ఇలా ఉన్నాయి...
మండలంలోని గ్రామాలలో ఆరుగురు సూపర్వైజర్లు,55 మంది ఎన్యుమరేటర్లు కులగణన సర్వేలో పాల్గొన్నారు. మొత్తం 5815 ఇండ్లకు స్టిక్కరింగ్ కాగా ఇప్పటివరకు 5495 ఇండ్లలో సర్వే పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.