దిశ, శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి (6E-025) ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద రెండున్నర కిలోలకు పైగా అక్రమ బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుడు తన లగేజీ భ్యాగ్‌లో గోల్డ్ చైన్‌లతో పాటు పేస్ట్‌గా బంగారం తయారు చేసి దానికి చుట్టు ప్యాక్ చేసుకుని వచ్చాడు.
అయితే శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన అతనిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో అతని లగేజి బ్యాగ్‌లో బంగారం బయట పడింది. బంగారం వెలికి తీసిన అధికారులకు 2715.800 గ్రాముల బంగారం పట్టుబడింది. పట్టుబడ్డ బంగారం విలువ 1 కోటి 36 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.