బీఆర్ఎస్ కు ఎదురుగాలి
పోయిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో గట్టెక్కిన 15 ఏండ్లుగా ఒకరేననే భావన ప్రభుత్వం పై ఉన్న తీవ్రవ్యతిరేకతతో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గట్టి దెబ్బ తప్పేలా లేదు అనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది.
దిశ, యాచారం : పోయిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో గట్టెక్కిన 15 ఏండ్లుగా ఒకరేననే భావన ప్రభుత్వం పై ఉన్న తీవ్రవ్యతిరేకతతో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గట్టి దెబ్బ తప్పేలా లేదు అనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది. యాచారం మండల విజయానికే వస్తే ఫార్మాసిటీ వల్ల తమ విలువైన వ్యవసాయ భూములను కోల్పోయామనే భావనలో నానక్ నగర్, తాడిపర్తి, కుర్మిద్ద, మేడిపల్లి గ్రామాల రైతులు ఉన్నారు. కాలుష్య కారాగారమైన ఫార్మాసిటీ ఏర్పడితే తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని రద్దు చేయాలని వ్యతిరేకంగా పోరాటాలు సైతం చేశారు. మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం పై తీవ్రవ్యతిరేకత బీఆర్ఎస్ మండల నాయకుల ఒంటెద్దుల పోకడ ఎమ్మెల్యే తమను పట్టించుకోవడంలేదని ఇటీవల కాలంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ పీఎస్ సీఎస్ చైర్మన్ నాయిని సుదర్శన్ రెడ్డి, కొత్తపల్లి మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, తిరుమలేష్ ని గుట్ట మాజీ చైర్మన్ భూపతి రెడ్డి, రెడ్డి వెంకట్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వైయస్సార్ టీపీ రాష్ట్ర నాయకులు అమృత సాగర్, 200 మంది కార్యకర్తలు మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గున్ గల్, మాల్, తక్కల్లపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన వందలాదిమంది కాంగ్రెస్ గూటికి చేరారు.
నియోజకవర్గ కాంగ్రెస్ లో భారీ చేరికలు
అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాలం ఖాన్, మున్సిపాలిటీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి మంచాల మండలం లింగంపల్లి గ్రామసర్పంచ్ పెరుకు మూర్తి, వినోద్ ఆరుట్ల గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డితో పాటు సర్పంచులు ఎంపీటీసీలు వెయ్యి మంది దాకా కాంగ్రెస్ గూటికి చేరారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతం బాలరాజు యాదవ్, హనుమండ్ల యాదగిరి, కమల్ నాథ్ రెడ్డి, చేరిగూడ బీఆర్ఎస్ నాయకులు నరికుడి భాస్కర్, రామలింగం, రాయపోలు గ్రామ మాజీ సర్పంచ్ పాశం అశోక్ గౌడ్, అభిమానులు అనుబంధ సంఘాల నాయకులతో వందలాది మందితో కాంగ్రెస్ లో చేరారు.