చెట్లకు గుట్టలకు రోడ్లకు కూడా రైతుబంధు ఇచ్చారు : షాద్ నగర్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతు బంధు పేరుతో ప్రజాధనాన్ని
దిశ,షాద్ నగర్ : బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతు బంధు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో స్వేచ్ఛ సమానత్వం తో ప్రజలు జీవిస్తున్నారని సుఖశాంతులతో ఉంటున్నారని పదేళ్ళు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం అప్పుల పాలు చేసిందని రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఉన్న కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులకురూ. 12,000 లతో రైతు భరోసా ఇవ్వడం హర్శించదగ్గ విషయమని గతంలో రైతుబంధు పేరిట గుట్టలకు పుట్టలకు రోడ్లకు అమెరికాలో ఉన్న ఎన్నారైలకు కూడా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారన్నారు.
రైతులకు రుణమాఫీతో పాటు వ్యవసాయం చేసే రైతన్నలకు రైతుబంధు రైతు భరోసా ఇస్తున్నామని ఇది రైతుల సమక్షంలోనే మేధావులతో అధికారులతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి తీసుకున్న నిర్ణయం అన్నారు. రైతుల ముసుగులో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న ధర్నాలని అన్నారు. ఇక ప్రస్తుతం పదేళ్లల్లో రాష్ట్రాన్ని వందల కోట్ల రూపాయలతో అప్పుల పాలు చేసి బ్రష్టు పట్టించిన లిక్కర్ రాణి మరో వేషంతో ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుందని ఎక్కడ కూడా 10 ఏళ్లలో బీసీల గురించి మాట్లాడలేదనీ బిసిలపై ప్రేమ ఉంటే మీ పార్టీకి అధ్యక్షుడుగానో వర్కింగ్ ప్రెసిడెంట్ గానో ఎన్నుకోండి చూద్దామన్నారు.కార్యక్రమంలో ఆదివాసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ పి.రఘు కొంకల్ల చెన్నయ్య పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.