84 గ్రామాలకు ఊరట..111 జీవోను ఎత్తివేసేందుకు కేబినేట్ ఆమోదం
1 జీవోతో శంకర్‌పల్లి, శంషాబాద్, షాబాద్, గండిపేట్, చేవెళ్ల మండలాల పరిధిలోని 84 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దిశ, రంగారెడ్డి బ్యూరో: జిల్లాలో 111 జీవోతో శంకర్‌పల్లి, శంషాబాద్, షాబాద్, గండిపేట్, చేవెళ్ల మండలాల పరిధిలోని 84 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 111 జీవో ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు ఊరట కలిగింది. ఇకపై ఆయా గ్రామాల్లో హెచ్ఎండీఏ విధివిధానాలే అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయా గ్రామాల్లోని రైతులు, సాధారణ పజ్రలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఐటీ హబ్‌గా అవతరించిన గచ్చిబౌలికి సమీపంలో ఆయా గ్రామాలు ఉండటం, ఆంక్షల ఎత్తివేత ద్వారా 1.32 లక్షల ఎకరాల లాండ్ బ్యాంకు సమకూరడం, దీనిలో 30 వేలకుపైగా ఎకరాల ప్రభుత్వ భూములు ఉండటం కలిసి వచ్చే అంశం. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు జాతీయ హరిత ట్రిబ్యూనల్‌లో కేసులు ఇప్పటికీ కొనసాగుతుండటం గమనార్హం. ఇప్పటి నుంచి ఈ జలాశయాల నీటిని నగరంలో పచ్చదనం పెంపొందింపజేసే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మూసీ సుందరీకరణ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల ద్వారా నీటిని మూసీలోకి వదిలేందుకు తగిన పథకం గతంలోనే రూపొందింది. నిర్మా ణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
హామీ అమలు..
జంట జలాశయాల పరిరక్షణ కోసం 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 111 జీవోను తీసుకొచ్చింది. ఈ జీవో ముఖ్య ఉద్దేశం జలాశయాలు కలుషితం కాకుండా ఉండేందుకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ 84 గ్రామాల ప్రజలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా క్రయవిక్రయాలు జరగకుండా ఇబ్బంది పడ్డారు. ఇదే ప్రాంతంలో కొంత బడా వ్యాపారులు రాజకీయ నాయకులు పలుకుబడితో నిర్మాణాలు చేపడుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అదే సామాన్య ప్రజలు రైతులు నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుం టూ ఇబ్బందులకు గురి చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని అనేకమార్లు స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. 20 22 ఏప్రిల్ 19న సీఎం కేసీఆర్ జీవోను ఎత్తివేస్తానని ప్రకటించారు. ఈ జీవో కు అనుసంధానంగా 69 జీవోతో సవరించి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు ప్రకటించారు. అయితే ఈ జీవో అమల్లో ఉందో లేదో తెలియక స్థానికులు సతమతమవుతున్న సందర్భం కొనసాగింది. తాజాగా కేబినెట్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఉపశమనం కలిగింది.
సాగర్లలోకి కాళేశ్వరం నీళ్లు..
హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు అందించేందుకు నిజాం ప్రభువు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను కట్టించారు. మొదట్లో నగరానికి "ఈ జలాశయాల నీరే ప్రధాన ఆధారం. క్రమేణ నగరం విస్తరించడం, జనాభా పెరగడంతో ఆ తర్వాతి వచ్చిన ప్రభుత్వాలు మంజీరా, సింగూరు జలాలను ఇక్కడికి తరలించారు. ప్రస్తుతం కృష్ణా గోదావరి నీళ్లు సరఫరా చేస్తున్నారు. తాజా జీఓ ఎత్తివేత కారణంగా చెరువు శిఖం భూముల్లో పెద్దెతున నిర్మాణాలు వెలిసే అవకా శం లేకపోలేదు. మురుగు నీరు వచ్చి చెరువులో కలిసే అవకాశం ఉంది. నివాసాల నుంచి వెలువడిన మురుగు నీరు జలాశయాల్లో కలవకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను.. నిర్మించనున్నట్లు ప్రకటించారు. అంతే కాదు జంట జలాశయాలను చేయాలని నిర్ణయించి, ఆ మేరకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.