శాంతి భద్రతలో కరన్ కోట్ పోలీస్ స్టేషన్ జిల్లాకే ఆదర్శం

కరన్ కోట్ పోలీస్‌ వికారాబాద్ జిల్లాకే ఆదర్శం శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కరన్ కోట్ పోలీసులు వికారాబాద్ జిల్లాకే ఆదర్శంగా నిలిచారు.

Update: 2024-12-29 14:26 GMT

దిశ, తాండూరు రూరల్ : కరన్ కోట్ పోలీస్‌ వికారాబాద్ జిల్లాకే ఆదర్శం శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కరన్ కోట్ పోలీసులు వికారాబాద్ జిల్లాకే ఆదర్శంగా నిలిచారు. 2024 సంవత్సరంలో నమోదైన కేసుల వివరాలను కరన్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఏడాదికాలంగా వివిధ కేసులను పరిశీలించిన ఎస్సై విఠల్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం శాంతిభద్రతల విషయంలో సక్సెస్ అవడానికి ప్రజల సహకారం ఉందన్నారు. కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 సంవత్సరానికి గాను 290 కేసులు నమోదైనట్లు కరన్ కోట్ ఎస్సై విఠల్ రెడ్డి వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 19 దొంగతనం కేసులలో రూ. 14 లక్షల అరవై నాలుగు వేల నగదును దోచుకెళ్లారని చెప్పారు.

దొంగతనం కేసులను నమోదు చేసుకున్న అనంతరం నేరస్తుల నుంచి రూ. 10 లక్షల 17వేల నగదు ను రికవరీ చేయగలిగామన్నారు. నమోదైన 19 దొంగతనం కేసులలో 70 శాతం మేరకు పురోగతి సాధించామన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల విషయంలో 20 కేసులు నమోదు అయినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఏడు మంది మృతి చెందగా 17 మంది గాయలకు గురైనట్లు నమోదు చేశామన్నారు. అదేవిధంగా 25 మిస్సింగ్ కేసులు నమోదు కాగా 23 కేసులను ట్రేస్ చేశామని వెల్లడించారు. 20 పేకాట కేసులు నమోదు చేశామన్నారు. ఎక్సైజ్ శాఖ పరిధిలోని 11 కేసులు సివిల్ సప్లై ఈ భాగంలో తహసీల్దార్ పరిధిలో మరో 2 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

మరో 11 కేసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై నమోదు చేసినట్లు చెప్పారు. అత్యధికంగా మద్యం సేవించి (డ్రంక్ అండ్ డ్రైవ్ ) వాహనాలు నడిపిన వారిపై 253 కేసులు నమోదైనట్లు చెప్పారు. బాల కార్మికులను పనులు పెట్టుకున్నందుకుగాను నాలుగు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అధిక లోడుతో వెలసిన వాహన ధరలపై నాన్ ఎఫ్ ఆర్ ఐ కింద 25 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఈనెల 31 అర్ధరాత్రి నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై సీరియస్ గా తీసుకుంటామని ఎస్సై ప్రకటించారు. పోలీస్ శాఖ అధికారుల సూచనలను పాటించి శాంతి భద్రతలకు సహకరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల యువకులు ప్రజలు నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.


Similar News