జోరుగా ప్రభుత్వ భూములలో ఎర్ర మట్టి దందా..

షాబాద్ మండలంలోని మన్మారి గ్రామ రెవెన్యూ అప్పా రెడ్డి గూడా సర్వే

Update: 2024-10-18 13:11 GMT

దిశ,షాబాద్ : షాబాద్ మండలంలోని మన్మారి గ్రామ రెవెన్యూ అప్పా రెడ్డి గూడా సర్వే నెంబర్ 352, 369 ప్రభుత్వ భూమి నుండి మట్టి దందా జోరుగా సాగుతున్న అడిగే నాథుడే కరువయ్యాడు. పగలు,రాత్రి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదు. షాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూముల నుంచి మట్టిని అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పక్క మండలమైన ఫరూక్ నగర్,కుజోరుగా ఎర్ర మట్టి దందా సాగుతున్న అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మట్టి టిప్పర్ ధర రూ. 6 వేల నుంచి 10 వేల వరకు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

ఆయా గ్రామాల పరిధిలోని రెవెన్యూ పంచాయతీ కార్యదర్శులు మట్టి అక్రమ రవాణా జరుగుతున్న చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుడండంతో ప్రభుత్వ భూములు గుంతలుగా మరి చెడిపోతున్నాయి. మండల శాఖ అధికారులు తమ పరిధిలో జరిగే అభివృద్ధి పనులను కూడా మట్టిని తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా వ్యాపారులు తమ వ్యాపారాన్ని యథేచ్చగా కొనసాగిస్తున్నారు. అక్రమంగా రవాణా మట్టిని తరలిస్తున్నారు మండల అధికారులు వెంటనే స్పందించి మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.


Similar News