రెడీ మిక్స్​ లారీ భీభత్సం.. వందల ప్రాణాలకు ముప్పు

Update: 2024-08-31 12:21 GMT

దిశ, బడంగ్ పేట్ : బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని అల్మాస్​ గూడలో ​రెడీ మిక్స్​ లారీ భీభత్సం సృష్టించింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే... బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని అల్మాస్ గూడ లోని ఆర్ వీఆర్ కాలనీ రోడ్డు నెంబర్​ 7లో శనివారం సాయంత్రం ఓ రెడీ మిక్స్​ లారీ వెళ్తుండగా విద్యుత్​ వైర్లు తగిలాయి. అది చూడకుండా లారీ డ్రైవర్​ వేగం పెంచడంతో విద్యుత్​ వైర్లు భిగించిన స్తంభమే విరిగి రెడీ మిక్స్​ లారీ పై పడింది. ఆసమయంలో వర్షం పడుతుండడంతో స్థానికులు ఎవరూ బయటికి రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్​ కూడా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్​ సరఫరాలో అంతరాయం కలిగింది. ఆ శబ్దం విన్న స్థానికులు వెంటనే బయటికి వచ్చి చూడడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ ఘటనా స్థలంలో విద్యుత్​ వైర్లు కిందికి వేలాడుతు ప్రమాదభరితంగా మారాయి. ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. ఎవ్వరినీ అటువైపు రాకుండా స్థానికులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెంటనే సంబంధిత విద్యత్​ శాఖ అధికారులు వెంటనే స్పందించి విరిగిన విద్యుత్​ స్తంభం చోట కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి కరెంట్​ సరఫరాను పునరుద్దరించాలని కోరుతున్నారు.


Similar News