పోతురాజుకుంట చెరువులో మట్టి హాం ఫట్..
మండల పరిధిలోని కోరింతకుంట తండా సమీపంలో ఉన్న పోతురాజుకుంట చెరువులో అక్రమ ఇసుక రవాణపై మైనర్ ఇరిగేషన్ ఏఈ రమేష్ నాయక్, మండల ఆర్ఐ మంజుల, సర్వేయర్ యాదగిరి సోమవారం స్పందించారు.
ఎట్టకేలకు చెరువు భూమిని సర్వే చేయించిన అధికారులు
దిశ, తలకొండపల్లి: మండల పరిధిలోని కోరింతకుంట తండా సమీపంలో ఉన్న పోతురాజుకుంట చెరువులో అక్రమ మట్టి రవాణాపై మైనర్ ఇరిగేషన్ ఏఈ రమేష్ నాయక్, మండల ఆర్ఐ మంజుల, సర్వేయర్ యాదగిరి సోమవారం స్పందించారు. ఆక్రమణకు గురైన పోతురాజుకుంట చెరువును నిశితరంగా పరిశీలించారు. గత మూడు రోజులుగా అర్ధరాత్రి వేళల్లో మట్టిని కొందరు అక్రమార్కులు టిప్పర్ల సాయంతో మట్టిని తరలిస్తున్న నేపథ్యంలో గిరిజనులు కాపు కాచి నాలుగు టిప్పర్లు, ఒక హిటాచిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం పాఠకులకు విధితమే.
ఈ క్రమంలో అధికారులు సోమవారం పోతురాజుకుంట చెరువులో ఆక్రమణకు గురైన భూమిని తహసీల్దార్ తో అధికారులు సర్వే చేయించారు. సర్వే నెం.168లోని 6.38 గుంటల ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడినట్లు ఆర్ఐ మంజుల కూడా ధ్రువీకరించారు. మైనర్ ఇరిగేషన్ ఏఈ రమేష్ నాయక్ తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో, స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. చెరువులోని ఆక్రమణకు సంబంధించి పూర్తి నివేదికను మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో అందజేయనున్నట్లు రమేష్ నాయక్ తెలిపారు.