అనుమతులు సువిధ లో దరఖాస్తు చేసుకోవాలి : రిటర్నింగ్ ఆఫీసర్ ఎ.విజయకుమారి
సాధారణ ఎన్నికలకు సంబంధించిన వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు ప్రచారం, ఇతర ఎన్నికలకు సంబంధించిన అనుమతులకు దరఖాస్తులు సువిధ ఆప్ లో చేసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్ ఎ.విజయ కుమారి సూచించారు.
దిశ,పరిగి : సాధారణ ఎన్నికలకు సంబంధించిన వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు ప్రచారం, ఇతర ఎన్నికలకు సంబంధించిన అనుమతులకు దరఖాస్తులు సువిధ ఆప్ లో చేసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్ ఎ.విజయ కుమారి సూచించారు. రిటర్నింగ్ ఆఫీసర్ అధ్యక్షతన పరిగి తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం గుర్తింపు పొందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు వారి పార్టీ ప్రచార అనుమతులను సువిధ అనే ఇంటర్నెట్ అప్ ద్వారా నే దరఖాస్తు చేసుకునే విధానం గురించి తెలియజేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఎం పార్టీల నాయకులుతోపాటు డీఎస్పీ కరుణా సాగర్ రెడ్డి, ఎన్నికల అధికారులు కోటి ఆనంద్ రావు, శేషగిరి శర్మ తదితరులు పాల్గొన్నారు.