గొర్రెలు, మేకలను దొంగిలించిన వ్యక్తుల అరెస్ట్, రిమాండ్..
అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని అనాజ్ పూర్ లో గొర్రెలను, మేకలను దొంగిలించిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
దిశ, అబ్దుల్లాపూర్మెట్: అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని అనాజ్ పూర్ లో గొర్రెలను, మేకలను దొంగిలించిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అబ్దుల్లాపూర్మెట్ సీఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 15 న రాత్రి సమయంలో అనాజ్ పూర్ గ్రామంలో ఒక ఇంటి ముందు కట్టిన అయిదు మేకలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. సదరు యజమాని నాయకపు నాగరాజు గారి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. కాగా సోమవారం ఉదయం 5 గంటల సమయంలో కొత్త గూడెం చౌరస్తా దగ్గర నల్గొండ జిల్లా ఆలయ పరిధిలోని ఆది నగర్ కు చెందిన సంపంగి వెంకటేష్(26), నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి సంపంగి వెంకటేష్ అలియాస్ కోటేష్(25) అను ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా తామే మేకలను దొంగిలించినట్టుగా ఒప్పుకున్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని యాచారం, మంచాల్, మహేశ్వరం, చౌటుప్పల్, ఇబ్రాహీంపట్నం, నారాయణపూర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో కూడా మేకలు, గొర్రెలు దొంగతనం చేసినట్లు నేరాన్ని అంగీకరించినారు. గతంలో కూడా పలు దొంగతనాల కేసులలో జైలుకు పోయి వచ్చినట్లు వివరించారు. వీరి నుండి 5 మేకలు, లక్ష నలబై వేల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు వివరించారు.