తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారింది: ఎల్ రమణ
తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్, ఎమ్మెల్సీ.... MLC Ramana Speech
దిశ, గండిపేట్: తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. బండ్లగూడ మున్సిపల్ లోని జిఆర్ కె గార్డెన్స్ లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గండిపేట్ మండల పార్టీ విస్తృత స్థాయి, ఆత్మీయ సమ్మేళనం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంఛార్జి ఎల్ రమణ తోపాటు ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. దాదాపు తొమ్మిదేండ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌పై ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గంలోని పది గ్రామాలకొక ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలన్నారు. ఉద్యమకారులు, క్రియాశీల సభ్యులు, బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యులు, ప్రతినిధులు ఈ సమ్మేళనాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, నార్సింగి చైర్మన్ రేఖ యాదగిరి, మణికొండ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేశ్వరం నర్సింహా, బీజేఎంసీ అధ్యక్షుడు సురేష్ గౌడ్, కార్పొరేటర్లు, సాగర్ గౌడ్, మాలతీ నాగరాజు, పద్మావతి పాపయ్య, పద్మావతి పండు, మణికొండ మహిళా అధ్యక్షురాలు పట్లోళ్ల రూపా రెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్ఎస్వీ ఇంచార్జి శ్రావణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.