పేదల సంక్షేమాన్ని అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది.. MLC Kalvakuntla Kavitha

దిశ, బడంగ్​పేట్​ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదగనీయకుండా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించింది...

Update: 2022-09-08 08:44 GMT

దిశ, బడంగ్​పేట్​ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదగనీయకుండా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించింది. ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల ఆ విఘ్నాలన్నీ తొలగిపోయి భారత్​లోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్​ వన్​ కావాలని ఆకాంక్షించారు. ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్​ గణేష్​ మండపాన్ని టీఆర్ఎస్​ యువనాయకుడు పటోళ్ల కార్తీక్​ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్​పర్సన్​ తీగల అనిత హరినాథ్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలతో కలిసి ఎమ్మెల్సీ కవిత సందర్శించి, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా బాలాపూర్​ గణేష్​ మండపాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత, టీఆర్​ఎస్​ యువనాయకుడు పటోళ్ల కార్తీక్​ రెడ్డిలకు బాలాపూర్​ గణేష్​ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్ళెం నిరంజన్​రెడ్డి స్వామి వారి లడ్డూ ప్రసాదంగా అందజేశారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ప్రతి ఏడు వినాయక చవతి వచ్చిందంటే బాలాపూర్​ గణేష్​ మండపం ఎలా ఉంటది? ఈ సారి లడ్డు వేలం పాట ఎంతకు పొతది అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. 'బాలాపూర్​ వినాయకున్ని దర్శించుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. బాలాపూర్​ గ్రామస్థులే ఒక కమిటీగా ఏర్పడి 42 సంవత్సరాలు గణేష్​ విగ్రహం ఏర్పాటు చేస్తుండడం అభినందనీయం. ఈ సారి అరుణాచల ఆకృతిలో ఏర్పాటు చేసిన గణేష్​ మండపం అద్భుతంగా ఉంది.

ఈ మంచి ఒరవడిని ఇలాగే కొనసాగించాలి పేదోల సంక్షేమాన్ని అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఆ స్వామి దయవల్ల మన రాష్ట్రానికి ఎటువంటి విఘ్నం లేకుండా జరుగుతున్నటువంటి అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకున్నా' అని కవిత అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో బడంగ్​పేట్​ టీఆర్​ఎస్​ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కంటెస్టెడ్​ కార్పొరేటర్​ వంగేటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Also Read : స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్ ఆరాటం : మాజీ మంత్రి బాబు మోహన్ 

Tags:    

Similar News