రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

శనివారం వికారాబాద్ నియోజకవర్గంలో రూ.10 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.

Update: 2023-05-20 11:54 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్: శనివారం వికారాబాద్ నియోజకవర్గంలో రూ.10 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో సమీకృత విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్ భవన కార్యాలయానికి, అలాగే మర్పల్లి మండల కేంద్రంలో గ్రంథాలయం నూతన భవనం, కల్కోడ లో విద్యుత్ సబ్ స్టేషన్, నూతన మండల పరిషత్ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

వికారాబాద్ జిల్లా అంటే ముఖ్యమంత్రికి ప్రత్యేక అభిమానమని, ప్రతి మీటింగ్ లో వికారాబాద్ ప్రస్తావన తీసుకువస్తారన్నారు. మర్పల్లిలో మండల తహశీల్దార్ కార్యాలయం, బస్టాండ్ నిర్మాణానికి కృషి చేస్తాం అన్నారు. నూతన సెక్రటేరియట్ లో మొదటి మీటింగ్ పాలమూరు రంగారెడ్డి పైనే నిర్వహించి ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను చాటారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, శాసన సభ్యులు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పాతూరి రామ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయ కుమారి, విద్యుత్ శాఖ ఎస్ఈ వి. జయరాజు, డీఈ ఆపరేషన్ సంజీవ్, ఏడీ ఆపరేషన్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News