కరెంట్ కోతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగర వాసులు!
పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఎండలు మండుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైనే ఉంటుందని అధికారులు లెక్కలు చెబుతున్నారు.
దిశ, రంగారెడ్డి బ్యూరో: పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఎండలు మండుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైనే ఉంటుందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఎండలకు తోడు కరెంట్ సరఫరా అంతరాయంతో ప్రజలు వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. అధికారులు కూడా మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్ అంతరాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫీడర్ల అత్యధిక లోడు పడితే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుచేత మధ్య మధ్యలో విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తున్నారు.
జనం విలవిల..
ఎండలతో బయటకు పోలేక, ఇంట్లో కరెంట్ లేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విద్యుత్ సరఫరాలో ఇష్టారీతిన అంతరా యం కలిగిస్తుండడంతో ప్రజలు మండిపడుతున్నారు. రాత్రి విద్యుత్ అంతరాయానికి చిన్నారులు నిద్రపోవడం లేదని, దీంతో జాగారం చేయాల్సిన అవసరం ఉందని వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ మండలాల్లో తప్ప రూరల్ మండలాల్లోని గ్రామాల్లో విద్యుత్ అంతరాయంతో అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న ఎండ వేడిమికి విద్యుత్ వినియోగం పెరిగింది. ఫలితంగా అనధికారిక విద్యుత్ కోతలు మొదలయ్యా యి. విద్యుత్ లోడ్ పెరగడంతో రెండు, మూడు గంటలు కోతలు విధిస్తున్నారు.
ఉరిమినా.. మెరిసినా..
గట్టిగా గాలి వీచినా చేవెళ్లలో కరెంట్ కట్ అవుతోంది. చిన్నపాటి వర్షం పడినా గంటల తరబడి కోత విధిస్తున్నారు. ఒక వేళ గట్టిగా గాలి వీస్తే అంతే సంగతులు. విద్యు త్ వైర్లు చాలా వరకు కిందకు వేలాడుతూ ఉండడంతో పాటు, వైర్లు ఒకదానికొకటి తాకడంతో షాక్ సర్య్కూట్‌తో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేశంపేట మం డలం, చింతకుంటపల్లిలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్, షాద్ నగర్ ప్రాంతంలో వీలైతే సాయంత్రం లేదా రాత్రి వేళల్లో రెండు నుంచి మూడు గంటల పాటు కరెట్ కోత విధిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా, తాండూరు, పరిగి, మోమిన్‌పే ట, నవాబుపేట, వికారాబాద్‌లో తరచూ వి ద్యుత్ కోతలు ఉత్పన్నమవుతున్నాయి. లైన్ క్లియర్(ఎల్‌సీ) పేరిట గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. కొడంగ ల్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొం ది. చిన్నపాటి వర్షం పడినా.. విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ సర ఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే క్షేత్ర స్థాయిలో 16 నుంచి 18 గంటల పాటు సరఫరా అవుతోంది. గ్రామీణ ప్రాం తాల్లో త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరా యం ఏర్పడుతోంది.
ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రూరల్ మండలాల్లో పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి తగ్గట్టుగా ముందస్తు చర్యలు లేవని తెలుస్తోంది. పెరుగుతున్న వేడిమికి ప్రజలు విద్యుత్ వినియోగంపై ఆధారపడుతున్నారు. అందుకు అనుగుణంగా విద్యుత్ శాఖాధికారులు ముందుగా ప్రణాళికలు రూపొందించుకోలేదని అర్థమవుతోంది. అందుకే అనధికారికంగా విద్యుత్ కోతలకు అధికారులు, సిబ్బంది తెగబడుతున్నారు. వారం నుంచి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం అధికమైంది.
ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగిపోయింది. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా కోత విధిస్తున్నారు. కరెంట్ ఎంత సేపు తీస్తారో.. ఎప్పుడు తీస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంట్లో శుభకార్యం ఉందంటే చాలు కు టుంబ సభ్యులు, బంధు మిత్రులు కరెంట్ కోత కారణంగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. మధ్యాహ్నం పవర్ కట్ తో చెట్ల కింద సేద తీరుతున్నారు.