గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో స్థానిక నేతలే కీలకం : చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే

ప్రజల ద్వారా ఎన్నుకోబడిన స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల

Update: 2024-07-02 16:34 GMT

దిశ,శంకర్పల్లి : ప్రజల ద్వారా ఎన్నుకోబడిన స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పేర్కొన్నారు. శంకరపల్లి మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగుస్తున్నందున మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి మరియు పాలకవర్గ సభ్యులను శంకర్పల్లి మండలం మరియు మున్సిపల్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కే.ఎస్ రత్నం మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల సేవలు మరువలేనివని, పదవీకాలం పూర్తవుతున్నందున ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజా సేవలో ఉంటూ ప్రజల నుండి గుర్తింపు పొందాలని సూచించారు.

ప్రజా ప్రతినిధులకు ప్రతి ఐదేళ్లకోసారి పదవీ విరమణ అనేది ఉంటుందని, కానీ నిరంతరం ప్రజాసేవలో ఉండే ప్రజాప్రతినిధులకు విరమణ అనేది ఉండదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శంకరపల్లి మండల బిజెపి అధ్యక్షుడు రాములు గౌడ్ మున్సిపల్ ఇంచార్జ్ వాసుదేవ్ కన్నా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు బిర్ల నరసింహ, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీలు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News