హైద‌ర్‌షాకోట్‌లో కారులో డెడ్‌బాడీ కల‌క‌లం

బండ్లగూడ జాగీర్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలోని హైదర్ షాకోట్ లో

Update: 2024-07-04 14:51 GMT

దిశ‌,గండిపేట్ : బండ్లగూడ జాగీర్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలోని హైదర్ షాకోట్ లో డెడ్ బాడీ కలకలం సృష్టించింది. ఓ కారులో డెడ్ బాడీ ఉన్న‌ట్లు గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు. వివ‌రాల ప్ర‌కారం.. గురువారం హైద‌ర్‌షాకోట్‌లో ఓ ఆగి ఉన్న కారులో మృత‌దేహం ఉన్న‌ట్లు స్థానికులు గుర్తించారు. దీంతో డ‌య‌ల్ 100 కు కాల్ చేసి స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ మేర‌కు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. రంగంలోకి దిగిన‌ క్లూస్ టీమ్ బృందాలు ప‌లు ఆధారాల‌ను సేక‌రించారు. హత్య ? లేక ఆత్మహత్య ? అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు వివ‌రించారు. గత మూడు రోజులుగా కారు పార్క్ చేసి ఉన్నట్లు తెలుస్తుంది.


Similar News