కసిరెడ్డితోనే కల్వకుర్తి ప్రాంతం అభివృద్ధి : మాధవి రెడ్డి

నియోజకవర్గంలోని పేద బడుగు, బలహీన వర్గాల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం కోసమే నారాయణరెడ్డి మీ ముందుకు వస్తున్నాడని కసిరెడ్డి సతీమణి మాధవి రెడ్డి అన్నారు.

Update: 2023-11-23 09:59 GMT

దిశ, తలకొండపల్లి : నియోజకవర్గంలోని పేద బడుగు, బలహీన వర్గాల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం కోసమే నారాయణరెడ్డి మీ ముందుకు వస్తున్నాడని కసిరెడ్డి సతీమణి మాధవి రెడ్డి అన్నారు. ఆయన్ని మీ బిడ్డగా ఆదరించి అభిమానించి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి పై ఉందని ఆమె అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో గురువారం స్థానిక నేతలు మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, అంజయ్య గుప్తాలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి రెడ్డి తొలిసారి మండల కేంద్రానికి రావడంతో మహిళలు, స్థానిక నేతలు, కార్యకర్తలు ఘనంగా మంగళ హారతులతో స్వాగతం పలికి ఆహ్వానించారు.

అంతకుముందు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవి రెడ్డి మాట్లాడుతూ తలకొండపల్లి మండల కేంద్రం నుండి కసిరెడ్డి సొంత గ్రామం ఖానాపూర్ కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని, మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేరుగా అతని దగ్గరకు వచ్చి చెప్పుకొని పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. అతను చిన్నప్పుడు మీ ప్రాంతంలో చదువుకొని, ఈరోజు అతను ఒక విద్యావేత్తగా రాష్ట్రస్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అంటే అది ఈ ప్రాంతం గొప్పదనం అన్నారు. కసిరెడ్డి స్నేహితులు ఎప్పుడైనా తనతో కలిసినప్పుడు ఆనాటి జ్ఞాపకాలను పాఠశాలల్లో ఉన్న స్థితిగతులను గుర్తుచేసుకొని బాధపడేవాడని ఆమె తెలిపారు.

పనిచేసే నాయకుడిని గెలిపించుకుంటే ఈ ప్రాంతం మరింత అభివృద్ధికి బాటలు పడతాయని, కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు సాగు నీరు తీసుకొచ్చి పచ్చని పంట పొలాలను చూడాలనేదే ఆయన ఏకైక లక్ష్యం ఆమె అన్నారు. ఈ ప్రాంతంలో విద్యావ్యవస్థ చాలా వెనుకబడిందని, చాలామంది పిల్లల తల్లిదండ్రులు చదువు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల్లోకి వస్తే విద్యా వికాస్ పథకం కింద ప్రతి విద్యార్థికి కేజీ నుండి పీజీ వరకు చదువుకోవడానికి ఐదు లక్షల గ్యారెంటీ కార్డు అందిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బోల యాదగిరి, రామ్మోహన్ రెడ్డి, అజీమ్, చెన్నకేశవరెడ్డి, గణేష్, పొన్నగంటి అశోక్, విజయ్, రవి, పంతు, కృష్ణ, మల్లేష్, పాండు, యాదయ్య, అశ్వ యాదయ్య, అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News