Kandukuru:పైసలు ఇస్తనే ఫైల్ ముందుకు!.. తహశీల్దార్ ఆఫీస్‌పై ఆరోపణలు

కందుకూరు మండలం మహానగరంగా మారుతున్న తరుణం లో మండలంలోని నేదునూరు, పులిమామిడి, తిమ్మాపూర్, రాచులూరు, ధ న్నారం, మురళీ నగర్, గూడూరు, మీర్కాన్‌పేట్ తో పాటు పలు గ్రామాల్లో అసైన్డ్, లావాణి పట్టా, సీలింగ్, భూదాన్ భూములు, చెరువులు, కుంటలు, వాగులను అక్రమార్కులు, రియల్టర్లు కబ్జాలు చేస్తున్నారు

Update: 2024-12-14 02:29 GMT

దిశ, మహేశ్వరం : కందుకూరు మండలం మహానగరంగా మారుతున్న తరుణం లో మండలంలోని నేదునూరు, పులిమామిడి, తిమ్మాపూర్, రాచులూరు, ధ న్నారం, మురళీ నగర్, గూడూరు, మీర్కాన్‌పేట్ తో పాటు పలు గ్రామాల్లో అసైన్డ్, లావాణి పట్టా, సీలింగ్, భూదాన్ భూములు, చెరువులు, కుంటలు, వాగులను అక్రమార్కులు, రియల్టర్లు కబ్జాలు చేస్తున్నారు. ఈ తతంగం అంత కందుకూరు తహశీల్దార్ కార్యాలయం నుంచి నడుస్తుందంటున్నారు.తహశీల్దార్ కార్యాలయంలో తప్పుడు రికార్డులను సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏళ్ల తరబడి భూమిని సాగుచేసుకుంటున్న వారు,రికార్డులో పట్టాదారులుగా భూమి ఉన్న వారి పేర్లను తొలగిస్తున్నారు.ఇతర వ్యక్తుల పేర్లమీద రాత్రికి రాత్రే భూముల రికార్డులను తారుమారు చేసి భూములను మాయం చేస్తున్నారు. కందుకూరు తహశీల్దార్ కార్యాలయంలో పైసలు ఇస్తేనే ఫైలు ముందుకు కదులుతది.. లేకపోతే మూ లకుపడతాది అన్నట్టు తహశీల్దార్ కా ర్యాలయంలో పనిచేసే అధికారుల తీరు ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయంలో రియల్టర్లు, రాజకీయ నాయకుల పనులైతే తొంద రగా అవుతున్నాయంటున్నారు. పేదవా ళ్లు మ్యూటేషన్, సక్సేషన్, భూ సమస్యల కోసం దరఖాస్తు పెట్టుకొని భూ సమస్య ను పరిష్కరించాలని తహశీల్దార్ కా ర్యాలయం చుట్టూ ఏళ్ల తరబడి చెప్పు లు అరిగేలా తిరిగినా తహశీల్దార్ కా ర్యాలయంలో భూ సమస్యలు పరిష్కా రం కావడం లేదంటున్నారు. తహశీల్దార్ కార్యాలయంలో ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారి ఫైల్ తొందరగా ముందుకు వెళ్తుందన్ని, పేదవాళ్ల ఫైల్ ను మాయం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

లేమూర్ భూములు తారుమారు..

కందుకూరు మండలంలోని లేమూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 246లో 1985 లో 19.10 ఎకరాల భూమిని అగర్ మియాగూడ, లేమూర్ గ్రామాలకు చెందిన అందే మైసయ్య, కడారి అంజయ్య, కడారి లక్ష్మయ్య, కడారి యాదయ్య, మల్లయ్య, జంగయ్య ఉస్మాన్ మెయినుద్దీన్ నుంచి కొనుగో లు చేశారు. నాటి నుంచి సాగు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్న గల్ల బాలరాజ్, చిన్నగల్ల చెన్నమ్మ,యాదయ్య రక్షిత కౌలుదారులమని రెండేళ్ల క్రితం కందుకూరు ఆర్డీవో కార్యాల యం నుంచి 38 ఈ సర్టిఫికెట్ పొందా రు. ఇటీవల ధరణిలో తమ పేరు మీద ఆరు ఎకరాల భూమిని పట్టా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అస లు పట్టదారులు ఈ నెల 9వ తేదీన కందుకూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న తమ భూమి రికార్డులను తహశీల్దార్ కార్యాలయంలో తారుమారు చేశారని రైతులు తహశీల్దా ర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపా రు. రికార్డులను తారుమారు చేస్తున్న రెవెన్యూ అధికారులపై జిల్లా స్థాయి ఉ న్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News