క్రీడల్లో మన దేశం చాలా వెనుకబడింది: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

గ్రామీణ ప్రాంతాలలోని యువతి యువకులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

Update: 2023-06-03 03:54 GMT

దిశ, తలకొండపల్లి: గ్రామీణ ప్రాంతాలలోని యువతి యువకులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని శుక్రవారం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాఘవేందర్ రెడ్డి హాజరై క్రీడాకారులకు క్రికెట్ కిట్లు, టీ షర్ట్ అందించారు. ఈ ఐపీఎల్ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లకు పైగా పాల్గొంటున్నట్లు, ఒక్కో జట్టు పది సార్లు ఇతర జట్లతో ఆడాల్సి ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అనంతరం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం కామన్వెల్ గేమ్స్‌లలో చాలా వెనుకబడిందని, క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు మరింతగా కృషి చేయాల్సిన బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు.

కేవలం యువకులు క్రికెట్ పైనే కాకుండా కబడ్డీ, వాలీబాల్, కో కో, హై జంప్, లాంగ్ జంప్, చెస్ లాంటి అన్ని రకాల క్రీడలపై దృష్టి సారించాలన్నారు. అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించిన జట్లకు ఐక్యత ఫౌండేషన్ తరపున ప్రథమ బహుమతి కింద 25000, ద్వితీయ బహుమతి కింద 15000, తృతీయ బహుమతి కింద 10000 రూపాయల పారితోషికం ఇవ్వబడునని రాఘవేందర్ రెడ్డి క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరిపల్లి సర్పంచ్ అనురాధ నరేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీరాములు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు నూనె రాఘవేందర్, శ్రీనివాసరెడ్డి, మల్లేష్ ,శివ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News