అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. రైతు నర్సింహా

తనకు ప్రభుత్వం కేటాయించిన అసైండ్ స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు వారి పేరు మీదికి మార్చుకొని సదరు ప్రభుత్వ భూములలో లేఔట్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారని జోర్క నర్సింహా ముదిరాజ్ ఆరోపించారు.

Update: 2022-10-22 10:46 GMT

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : తనకు ప్రభుత్వం కేటాయించిన అసైండ్ స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు వారి పేరు మీదికి మార్చుకొని సదరు ప్రభుత్వ భూములలో లేఔట్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారని పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పశుమాములకు చెందిన జోర్క నర్సింహా ముదిరాజ్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం కబ్జా అయిన తన భూమిలో అక్రమంగా జరిగిన నిర్మాణాలను విలేకరులకు వివరించిన అనంతరం ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం అందజేశారు. తనకు పసుమముల సర్వే నెం. 386/1 ఎ లో .2.14 గుంటల భూమిని గత 1984 నుంచి భూమి శిస్తు చెల్లిస్తూ సాగుచేస్తున్నానని, ఇటీవల ఈ స్థలం జోర్క స్వర్ణలత సర్వే నెం.386/1 ని 386/4/అ గా మారుస్తూ అక్రమంగా తనపేరుమీద చేసుకున్నారని ఆరోపించారు.

అనంతరం స్వర్ణలత పేరుపై అబ్దుల్లాపూర్మెట్ రెవెన్యూ అధికారులు పాసుపుస్తకం మంజూరు చేసారని వివరించారు. అంతే కాకుండా రెవెన్యూ చట్టప్రకారం ప్లాటు చేసి అమ్ముకొనే అధికారం లేదని, కొందరు టీఆర్ఎస్ నాయకుల అండదండలతో ప్లాట్లు చేసి విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారన్నారు. తన పేరుపై ఉన్న భూమిని అక్రమంగా స్వర్ణలత పేరిట చేసుకున్న లావణ్య పాస్ పుస్తకాన్ని రద్దుచేసి అనుమతులు లేకుండా లే అవుట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

Tags:    

Similar News