ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం.. మల్రెడ్డి రంగారెడ్డి
ప్రజాసంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి రంగారెడ్డి అన్నారు.
దిశ, అబ్దుల్లాపూర్మెట్ : ప్రజాసంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి రంగారెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద అంబర్పేట్ టీఆర్ఎస్ అధ్యక్షులు సిద్ధంకి కృష్ణ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మున్సిపల్ కి ఎటువంటి అభివృద్ధి చేయలేదని వివరించారు. మున్సిపాలిటీలో 20 ఏళ్ల కింద మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పటికి ఉన్నాయని తిరిగి 20 ఏళ్ల తర్వాత రంగారెడ్డి మంత్రి హోదాలో కార్యక్రమాలు చేస్తారని వివరించారు.
అనంతరం పలుపార్టీలకు చెందిన నాయకులను కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ పార్టీ అధ్యక్షులు కొత్తపెళ్లి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చామ సంపూర్ణ రెడ్డి, కౌన్సిలర్లు రాజేందర్ జయ శ్రీ, చల్లూరు మురళీధర్ రెడ్డి, బ్యాంక్ చైర్మన్ కృష్ణారెడ్డి నాయకులు అయ్యప్ప రెడ్డి దండం రాజశేఖర్ రెడ్డి, గోవింద్ రెడ్డి, దేవిడి వేణుగోపాల్ రెడ్డి, చంద్రగోని గోవర్ధన్ గౌడ్, మల్లెపాక మల్లేష్ పాలడుగు నాగార్జున తదితరులున్నారు.