హిమాయత్ సాగర్ జలాశయంలో భారీ కొండచిలువ కలకలం

హిమాయత్ సాగర్ జలాశయంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. జ‌లాశ‌యం క్ర‌స్ట్ గేట్ వ‌ద్ద ఇరుక్కొని కొండ చిలువ న‌ర‌క‌యాత‌న అనుభవిస్తుండ‌టాన్ని గ‌మ‌నించిన అధికారులు ఎట్ట‌కేల‌కు కొండ చిలువును కాపాడారు.

Update: 2024-10-21 14:35 GMT

దిశ, గండిపేట్ : హిమాయత్ సాగర్ జలాశయంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. జ‌లాశ‌యం క్ర‌స్ట్ గేట్ వ‌ద్ద ఇరుక్కొని కొండ చిలువ న‌ర‌క‌యాత‌న అనుభవిస్తుండ‌టాన్ని గ‌మ‌నించిన అధికారులు ఎట్ట‌కేల‌కు కొండ చిలువును కాపాడారు. వివ‌రాల ప్ర‌కారం.. జలాశయం క్రస్ట్ గేటు వద్ద ఓ కొండచిలువ ఇరుక్కుంది. దీంతో కొండ చిలువ న‌రక యాతన అనుభవించ‌డాన్ని గుర్తించిన జ‌ల‌మండ‌లి అధికారులు వెంట‌నే స్పందించారు. కొండ చిలువను కాపాడేందుకు వెంట‌నే స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. క్ర‌స్ట్ గేట్ వ‌ద్ద ఇరుక్కున కొండ చిలువ‌ను అతి క‌ష్టం మీద కాపాడారు. దైర్యంగా క్ర‌స్ట్ గేటు వ‌ద్ద‌కు దిగి పాము నోటిని ప‌ట్టుకొని తాడు స‌హాయంతో స్నేక్ సొసైటీ స‌భ్యులు కాపాడి పైకి తీసుకువ‌చ్చారు. అనంత‌రం భారీ కొండ చిలువ‌ను జూ అధికారుల‌కు అప్ప‌గించారు. భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయానికి కొండచిలువ కొట్టుకువచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు.


Similar News