గొల్ల కురుమల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : సబితా ఇంద్రారెడ్డి
గొల్ల కురుమల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
దిశ,మహేశ్వరం: గొల్ల కురుమల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండల కేంద్రంలో పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాల్లో గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కుల వృత్తుల వారికి అండగా నిలుస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఎన్నికలు వచ్చినప్పుడే గ్యాస్ ధరలు తగ్గిస్తుందన్నారు. ఎన్నికలు అయిపోగానే గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని,మహిళలకు ప్రతినెల మూడు వేలు రూపాయలు అందిస్తామన్నారు.
93 లక్షల రేషన్ కార్డు దారులకు ఐదు లక్షలతో భీమా కల్పిస్తామన్నారు. సంక్షేమాల ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ ఎంపీపీ సునీత ఆంధ్యా నాయక్,పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, అమీర్ పేట్ ఎంపీటీసీ కుమారి రాయప్ప, సుభాన్ పూర్ సర్పంచ్ గుత్తి పద్మ పాండు, పీఏసీఎస్ డైరక్టర్ పోల్కం బాలయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి గౌడ్, నాయకులు మల్లేష్ యాదవ్, అంబయ్య యాదవ్,నర్సింహ యాదవ్, కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్,మిద్దింటి బాల్ రాజ్,గొల్ల కురుమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.