పార్టీ కోసమే పని చేస్తా.. అధిష్టానం గుర్తిస్తుందని నమ్మకం ఉంది: గోలి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి పార్టీ కోసం ఎలాంటి చిన్న పదవి కూడా ఆశించకుండా నేటి వరకు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2023-05-22 03:18 GMT

దిశ, తలకొండపల్లి: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి పార్టీ కోసం ఎలాంటి చిన్న పదవి కూడా ఆశించకుండా నేటి వరకు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం గోలి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను కడ్తాల్ మండల కేంద్రం నుండి ప్రారంభించి ఆమనగల్, వెల్దండ మండలాల మీదుగా కల్వకుర్తి వరకు హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారి పొడవునా పెద్ద ఎత్తున బాణాసంచాలు కాలుస్తూ, పూల వర్షం కురిపిస్తూ వందల సంఖ్యలో కాన్వాయిలతో గోలి శ్రీనివాస్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. జన్మదిన వేడుకల సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి, భారీ ఎత్తున మొక్కలు నాటారు. అనంతరం రాగాయిపల్లి గేట్ సమీపంలో జన్మదినోత్సవ వేడుకల కోసం భారీ స్థాయిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2012 సంవత్సరం నుంచి ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ కోసం కష్టపడుతున్నానని, ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి పదవి అప్పగిస్తే కల్వకుర్తి నియోజకవర్గంలోని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. గోలి శ్రీనివాసరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వారిలో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ హెడ్మాసత్యం, అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, పెద్ద సంఖ్యలో హాజరై శ్రీనివాస్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News