రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్

Update: 2024-10-18 10:31 GMT

దిశ, శంషాబాద్ : రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో రోడ్ల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శంషాబాద్ నుంచి శంషాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పై భారీగా ట్రాఫిక్ ఉండడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయని దాన్ని దృష్టిలో ఉంచుకొని నాలుగు లైన్ల రోడ్డు గా మార్చేందుకు రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేయాలని అన్నారు.

గండిపేట నుండి శంకర్పల్లి వెళ్లే నాలుగు లైన్ల రోడ్డు 6 లైన్లుగా మార్చేందుకురూ. 20 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. శంషాబాద్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని ఈ ప్రాంతంలో రోడ్డు కనెక్టువిటీ మరింత పెంచాలన్నారు. అంతే కాకుండా శంషాబాద్ బస్టాండ్ నుండి అమ్మపల్లి వద్దకు మంజూరైన నాలుగు లైన్ల రోడ్డు జరుగుతున్న పనులు ఆర్ అండ్ బి, హెచ్ ఆర్ డీసీఎల్ రెండు సంస్థలకు మంజూరు అయినందున ఆ పనులు హెచ్ఆర్డీసీఎల్ సంస్థ ద్వారా చేపట్టేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ప్రతిపాదించిన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారని అతి త్వరలో అధికారులతో చర్చించి నిధులు మంజూరు కొరకు కృషి చేస్తానని తెలిపినట్లు తెలిపారు.


Similar News