మేము జైలుకు వెళ్లినా సరే బుల్డోజర్లకి అడ్డంగా ఉంటాం : కేటీఆర్

మేము జైలుకు వెళ్లినా సరే బుల్డోజర్లకు అడ్డంగా మేమే ఉంటాం

Update: 2024-09-30 14:09 GMT

దిశ, శంషాబాద్ : మేము జైలుకు వెళ్లినా సరే బుల్డోజర్లకు అడ్డంగా మేమే ఉంటాం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్ గూడా లోని మూసీ బాధితులను మాజీ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  పరామర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వచ్చి అదే ప్రభుత్వ అధికారులు కూలుస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 రోజులలో ఆరు గ్యారెంటీ ల అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఢిల్లీ బాసుల మెప్పు కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు మొదలు పెట్టారన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అన్ఫిట్ అన్నారు. పేదవాడి ఇండ్ల జోలికి వస్తే ఖబడ్తారని హెచ్చరించారు. వారిని ఓదార్పు మీ ఇల్లు కూలగొట్టడానికి వస్తే మేము జైలుకెళ్లినా సరే బుల్డోజర్లకు అడ్డంగా మేము నిలుస్తామన్నారు. హైకోర్టు ఏ కాదు సుప్రీంకోర్టుకు వెళ్లిన మీ ఇళ్లను కూల్చకుండా అడ్డుకుంటామన్నారు. మీకు అండగా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు.

కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులోనే ఉంది కదా మరి దాన్ని ఎందుకు కూల్చారన్నారు. రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డికి ఒక న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా అన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో దేశంలోని అతిపెద్ద కుంభకోణానికి తెరలేపారన్నారు. మోడీ ప్రధాని అయ్యాక నమామి గంగా ప్రాజెక్టు తీసుకొచ్చారు. 2400 కిలోమీటర్ల ప్రాజెక్టుకు 44 వేల కోట్లయితే, 55 కిలోమీటర్ల మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల అన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలవే ఎఫ్డిఎల్ బఫర్ జోన్లలో ఉన్నాయి వాటిని కూల్చే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకుంటే వాటిని కూల్చే డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తానంటే న్యాయమా అన్నారు. మీ ఇల్లు కూల్చడానికి అధికారులు ఎవరైనా వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉండి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News