గడీల రాజ్యం వద్దు ప్రజాస్వామ్య పాలన ముద్దు : కేఏల్​ఆర్​​

త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ లో గడీల రాజ్యం పాలన పెచ్చురేగిపోతుందని సబ్బండ ప్రజలంతా తిరగబడి ప్రజాస్వామ్య పాలన కొరకు ఐక్యంగా ముందుకు సాగుదాం అని మహేశ్వరం కాంగ్రెస్​ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు

Update: 2023-10-30 15:18 GMT

దిశ, తుక్కుగూడ: త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ లో గడీల రాజ్యం పాలన పెచ్చురేగిపోతుందని సబ్బండ ప్రజలంతా తిరగబడి ప్రజాస్వామ్య పాలన కొరకు ఐక్యంగా ముందుకు సాగుదాం అని మహేశ్వరం కాంగ్రెస్​ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు చల్ల నర్సింహ్మారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గం కాంగ్రెస్​కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి కేఏల్​ఆర్​తో పాటు కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు దేప భాస్కర్​రెడ్డి, వై అమరేందర్​రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఏల్​ఆర్ ​మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం నుంచి టికెట్​కోసం జిల్లా అధ్యక్షుడు తో పాటు దేపా భాస్కర్​రెడ్డి, వై అమరేందర్​రెడ్డి లు, పారిజాత నర్సింహ్మారెడ్డి లు పోటీ పడ్డారన్నారు.

కాంగ్రెస్​ అధిష్టానం మాత్రం తన పేరు ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. నియోజకవర్గం నుంచి గత కొంత కాలంగా సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు సాగించిన పోటిదారులందరితో తాను కలిసి సమన్వయంతో ముందుకు పోతానని ఆయన పేర్కొన్నారు. అంతర్గతంగా కొంత బాధ ఉన్న వారంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి తనతో కలిసి వచ్చిన వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే చిగిరింత పారిజాత నర్సింహ్మారెడ్డి కుడా తనతో కలిసి నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో సబ్బండ వర్ణాలు గోస పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్​ఎస్​ పాలన పై అన్ని వర్గాల ప్రజలంతా అసెంబ్లీ ఎన్నికల్లో సురుకు పెట్టేందుకు రెడీగా ఉన్నారన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ పార్టీ నుంచి గెలిచి అమ్ముడు పోయిన సబితమ్మ కు నియోజకవర్గ ప్రజలంతా ఈ దఫా ఎన్నికలో గుణపాఠం చేబుతారన్నారు.

మంత్రి పాలనలో నియోజకవర్గంలో ఎక్కడ చూసిన కబ్జాలు, సెటిలిమెంట్​ల దందా కొనసాగుతుందని చెరువుల సుందరీకరణ పేరుతో చెరువుల కే శఠగోపం పెడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. తాను కేఏల్​ఆర్​ కంపెనీతో వేలాది మందికి ఉపాధి కల్పించానని ఏక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడలేదని.... కేఎల్​ఆర్​ అంటేనే సేవకుడు అని పేరు తెచ్చుకొన్నట్లు చెప్పారు. ప్రపంచంలో 50 దేశాల్లో తమ కంపెనీ ప్రాజెక్టులు పనులు కొన సాగుతున్నాయని చెప్పారు. బీఆర్​ఎస్​ పాలనలో దోచుకో ...దాచుకో సిస్టమ్​ వచ్చిందన్నారు. కాంగ్రెస్​ పాలనలో కట్టిన నాగర్జున సాగర్ ​ప్రాజెక్ట్​, శ్రీశైలం ప్రాజెక్టు నేటికి చెక్కు చేరలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఊదరగొట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు బీటలు బారాయే సీఎం కేసీఆర్​ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్​ చేశారు.

సీఎం కేసీఆర్ ​ఇచ్చిన ఒక్క హామీ అమలు కావడం లేదని ముస్లిం కు ప్రకటించిన 12 శాతం రిజర్వేషన్​ అటకెక్కిందని, గొర్రెల స్కీం మధ్యలోనే ఆగిపోయిందని దళితులకు ఇచ్చిన హామీలు నేటికీ అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం ఆరు గ్యారంటీల ప్రకటనతో బీఆర్​ఎస్​ సర్కా ర్​ఆగమాగం అవుతుందన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం 30 రోజులోనే అధికారం లోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామిలను అమలు చేసి తీరుతాం అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని సేవకుడు కావాల్లో ...మోసకారి కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. తుక్కుగూడలో నే ఇళ్లు కట్టుకొన్నాని ఇక నుంచి అందరికి అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో తనదైన శైలీలో ప్రతిపక్ష పార్టీ నేతలు, ప్రభుత్వం పై పంచులు విసిరారు. ఆయన చేసిన ప్రసంగం నాయకులు, కార్యకర్తలో కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News