దిశ ఎఫెక్ట్ : ఊర చెరువు నాలాను సందర్శించిన అధికారులు
ఓ యజమాని వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తానని ఊర చెరువు నాలను, మట్టితో పూడ్చివేసి రోడ్డుకు సమాంతరంగా మట్టితో ఎత్తును పెంచడంతో గొలుసు కట్టు చెరువులకు ప్రమాదం పొంచి ఉందని,
దిశ, యాచారం : ఓ యజమాని వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తానని ఊర చెరువు నాలను, మట్టితో పూడ్చివేసి రోడ్డుకు సమాంతరంగా మట్టితో ఎత్తును పెంచడంతో గొలుసు కట్టు చెరువులకు ప్రమాదం పొంచి ఉందని, చెరువులలోకి పారె నీరు ఎటు పోక చెరువులు ఎడారిగా మారి భూగర్భ జలాలు అడుగంటి పోతాయని రైతులు మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారని, బుధవారం దిశ, దినపత్రికలో దర్జాగా నాలా కబ్జా..కథనం ప్రచురితం మవడంతో ఇరిగేషన్, రెవెన్యూ, అధికారులు అందించారు. గురువారం మండల పరిధిలోని నక్కర్త మేడిపల్లి, ఊర చెరువు నాలాను ఇరిగేషన్ డీఈ మంజుల, ఎమ్మార్వో ఆదేశంతో ఆర్ఐ మురళీకృష్ణ, ఊర చెరువు నాలాను సందర్శించారు. ఊర చెరువు నాలాకు హద్దులను ఏర్పాటుచేసి హద్దుల ప్రకారం చెరువులోకి పారె వాగుకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఎత్తు పెంచిన మట్టిని తొలగించాలని మట్టితో పూడ్చి వేసిన నాలాలోని మట్టిని తీసివేయాలి పట్టాదారుడుని ఆదేశించారు. ఎవరైనా నాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాలా వెనుక భాగాన పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, తహసీల్దార్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.