గిరిజన హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కు కారణమైన నలుగురు సస్పెండ్
తాండూరు పట్టణంలోని సాయిపూర్ లో గల గిరిజన బాలికల హాస్టల్లో విద్యార్థుల అస్వస్థతకు కారణమైన నలుగురిని విధుల నుంచి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.
దిశ తాండూర్ పట్టణం: తాండూరు పట్టణంలోని సాయిపూర్ లో గల గిరిజన బాలికల హాస్టల్లో విద్యార్థుల అస్వస్థతకు కారణమైన నలుగురిని విధుల నుంచి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కు కారణమైన అన్ని విషయాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్ విశ్వకుమారితోపాటు, విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరి, లక్ష్మి, సరిత మొత్తం నలుగురిని విధుల నుంచి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.