తలకొండపల్లి ఎంపీపీ పై అవిశ్వాసం!?

తలకొండపల్లి మండల పరిషత్ ఎంపీపీగా గత నాలుగున్నర సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి జనరల్​ మహిళా కోటా కింద ప్రకటించిన ఎంపీపీ పీఠాన్ని రాంపూర్ గ్రామ ఎంపీటీసీగా గెలుపొందిన తిరుమని నిర్మల శ్రీశైలం గౌడ్ ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

Update: 2023-12-20 13:37 GMT

దిశ, తలకొండపల్లి : తలకొండపల్లి మండల పరిషత్ ఎంపీపీగా గత నాలుగున్నర సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి జనరల్​ మహిళా కోటా కింద ప్రకటించిన ఎంపీపీ పీఠాన్ని రాంపూర్ గ్రామ ఎంపీటీసీగా గెలుపొందిన తిరుమని నిర్మల శ్రీశైలం గౌడ్ ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఎంపీపీ పదవీకాలం మరో ఆరు నెలల్లో ముగియనుంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో తలకొండపల్లి మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు గాను, 6 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ గెలిపించుకోగా, మూడు స్థానాలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఒక్కోస్థానంతో సరిపెట్టుకున్నారు.

జూలపల్లి ఎంపీటీసీ మాత్రం బ్యాట్ గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 7 మంది కాంగ్రెస్ కు బలం పెరగడంతో బుధవారం కందుకూరు ఆర్డీవో సూరజ్ కుమార్ కు తలకొండపల్లి ఎంపీపీ నిర్మలపై అవిశ్వాసం నోటీసులు అందజేసినట్లు తెలిపారు. 2019 జూన్ 7 వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీపీ ,ఎంపీటీసీలు, 2024 జూన్ 6వ తేదీతో వారి పదవీకాలం ముగియనుంది. బుధవారం కందుకూరు ఆర్డీవోకు అవిశ్వాసం పై నోటీసులు అందజేసిన వారిలో తలకొండపల్లి వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, జూలపల్లి ఎంపీటీసీ సునీత సుదర్శన్ రెడ్డి, వెల్జాల్ ఎంపీటీసీ అంబాజీ, చంద్రధన ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, పడకల్ ఎంపీటీసీ రమేష్, తలకొండపల్లి ఎంపీటీసీ హేమారాజు, చౌదర్పల్లి ఎంపీటీసీ పెంటమ్మలు ఉన్నారు. జనరల్​


Similar News