పశు వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రసవ వేదన భరించలేక గేదె మృతి
మోమిన్ పేట మండల పరిధిలోని రాళ్లగుడపల్లి గ్రామంలో ప్రసవ వేదన భరించలేక గేదె తో పాటు గేదె యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
దిశ, మోమిన్ పేట: మోమిన్ పేట మండల పరిధిలోని రాళ్లగుడపల్లి గ్రామంలో ప్రసవ వేదన భరించలేక గేదె తో పాటు గేదె యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గేదె ప్రసవ వేదన విషయమై పలుమార్లు పశువైద్యాధికారులకు గాని వైద్య సిబ్బందికి ఫోన్ చేసిన స్పందించకపోవడంతో ఇంటి వద్దనే ప్రసవ వేదన భరించలేక గేదె మృతి చెందడం జరిగింది. గేదె యజమాని కుమ్మరి రాజు ఉదయం నుండి పలుమార్లు పశు వైద్యాధికారికి, సిబ్బందికి ఫోన్లు చేసిన సెలవు దినం కావడంతో వైద్య సిబ్బంది స్పందించకపోవడంతో గేదె మృతి చెందడం జరిగింది. దీంతో గేదె యజమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వైద్యాధికారులు అందుబాటులో సరైన సమయంలో వచ్చినట్టయితే బ్రతికే ఉండేదేమోనని వారు అనుకుంటున్నారు. ధనవంతుడికి ట్రాక్టర్ ఉంటే పేదవాడికి గేదె ట్రాక్టర్ లాంటిదని మమ్మల్ని బ్రతికించేదని వారు కన్నీరు మున్నీరై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి మృతి చెందిన గేదె యజమానికి ఆర్థిక సహాయం అందించాలని వారు కోరుతున్నారు.