పకడ్బందీగా డిజిటల్ కార్డు సర్వే నిర్వహించాలి : కలెక్టర్ శశాంక

పకడ్బందీగా డిజిటల్ కార్డు సర్వే నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్

Update: 2024-10-03 13:03 GMT

దిశ,శంషాబాద్ : పకడ్బందీగా డిజిటల్ కార్డు సర్వే నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తుప్పర తండా లో సర్వే ప్రారంభించింది. సర్వే ప్రక్రియను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి ఒక గుర్తింపు కార్డు డిజిటల్ కార్డు ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకువచ్చిందని, దీనిలో భాగంగానే అధికారులు ప్రతి ఇంటికి తిరుగుతూ డిజిటల్ కార్డు సర్వేను ప్రారంభించడం జరిగిందన్నారు.

గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయని సంఖ్య ఈ డిజిటల్ కార్డు సర్వే ద్వారా తెలుస్తుందన్నారు. ఇంట్లో పెళ్లయిన భార్యాభర్తలు ఉంటే ఓ కుటుంబంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి పేదవాడికి ఈ కార్డు ఇవ్వాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, ఫ్యామిలీకి డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి, తహసీల్దార్ రవీందర్ దత్తు, ఎంపీఓ ఉషాకిరణ్, ఎంపీడీవో మున్ని, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్ కుమార్,మాజీ ఎంపిపి జయమ్మ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ హస్లీ రాములు నాయక్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


Similar News