మున్సిపల్ కార్యాలయంలో ఫైలు కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే

ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయంలో ఓ ఉద్యోగి అవినీతి దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలన్న చందంగా చిన్న పనికి కూడా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడం ఆ ఉద్యోగి స్టైల్

Update: 2023-04-20 07:14 GMT

దిశ, ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయంలో ఓ ఉద్యోగి అవినీతి దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలన్న చందంగా చిన్న పనికి కూడా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడం ఆ ఉద్యోగి స్టైల్. డబ్బు ముట్టనిదే చిన్న పని కూడా జరగని పరిస్థితి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రజా ప్రతినిధులకు, కౌన్సిల్‌కు కార్యాలయం పై పట్టు లేకపోవడంతో ఆ ఉద్యోగి సొంత రాజ్యాంగా వ్యవహరిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాడు. ఇంటి పన్ను తక్కువగా ఉన్న ఎక్కువ మొత్తంలో బాధితుల నుంచి జమ చేసుకుంటూ.. ఇంటి నెంబర్ కావాలంటే ఆ ఉద్యోగికి లంచం ముడితేనే పని అవుతుంది.

ఇంటి పన్ను విషయానికి వస్తే వ్యాపార దుకాణాలకు సైతం లంచం ముడితే ఇంటి పన్నుగానే పరిగణిస్తాడు. కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న సామాన్య ప్రజల నుంచి పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటున్నట్టు స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. పని నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలంటేనే మున్సిపల్ ప్రజలు జంకుతున్నారు. ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయంలో అవినీతి దందాకు తెరలేపిన ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పేర్కొంటున్నారు.

కౌన్సిలర్ల సహకారంతోనేనా??

మున్సిపల్ పాలకవర్గంలోని కొంతమంది కౌన్సిలర్ల సహకారంతోనే ఆ ఉద్యోగి ఈ అవినీతి దందాకు తెరలేపినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ ఉద్యోగి దందాపై ఉన్నతాధికారులకు తెలిసిన చర్యలు తీసుకోకపోవడంతో పట్టణ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News