పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేయండి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
దిశ, మీర్ పేట్: పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 31, 32, 36 వ డివిజన్ లలో అసంపూర్తిగా ఉన్న ఎస్ఎన్ డీపీ నాలా పనులను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి మంత్రి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వారి విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకొని అందుకు తగినట్లుగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాలనీ వాసులతో కలిసి కాలినడకన నడుచుకుంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.
ఆర్ సీఐ రోడ్డు వద్ద నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ బ్రిడ్జిని వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి అని అన్నారు. వీధి వర్తక వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించిన మంత్రి కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు సమీపంలో విశాల్ మార్ట్ ప్రక్కన ఏర్పాటు చేసిన వీధి వర్తక వ్యాపారస్తుల కోసం నూతనంగా నిర్మించిన షెడ్లను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మేయర్ యం దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, కమిషనర్ నాగేశ్వరరావు, ఫ్లోర్ లీడర్లు ఆర్కల భూపాల్ రెడ్డి, సిద్ధాల లావణ్య బీరప్ప, కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, కార్పొరేటర్ వేముల నరసింహ తదితరులు పాల్గొన్నారు.