సబితా ఇంద్రారెడ్డికి భూదేవికి ఉన్నంత ఓపిక : సీఎం కేసీఆర్

నిరంతరం ప్రజల మధ్య ఉండి పనిచేసే గొప్ప ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో ఉందని బీఆర్​ఎస్ అధినేత, సీఎం కేసీఆర్​ ప్రజలకు సూచించారు.

Update: 2023-11-23 09:47 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో, బడంగ్​పేట్ ​: నిరంతరం ప్రజల మధ్య ఉండి పనిచేసే గొప్ప ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో ఉందని బీఆర్​ఎస్ అధినేత, సీఎం కేసీఆర్​ ప్రజలకు సూచించారు. నియోజకవర్గంలోని సమస్యను వ్యక్తిగత శ్రద్దతో పరిష్కారించేందుకు కృషి చేస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్​పేట్ కార్పోరేషన్​ పరిధిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాధ సభలో సీఎం కేసీఆర్​ ప్రసంగించారు. కాంగ్రెస్​ ప్రభుత్వ హాయంలో నాలాలు కబ్జాలకు గురికావడంతో బడంగ్​పేట్​, మీర్​పేట్​, జల్​పల్లి ప్రజలు వర్షాకాలంలో ముంపునకు గురైతున్నారని గుర్తు చేశారు. ఈ మున్సిపాలిటీలోని ప్రజలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు నాలాల పునరుద్దరణతో పాటు, చెరువుల సుందరీకరణ చేపట్టాలని సబితా ఇంద్రారెడ్డి పట్టుబట్టి నిధులు తీసుకొచ్చిందని సీఎం కేసీఆర్​ తెలిపారు. హైదరాబాద్​కు అతిసమీపంలోనున్న మున్సిపాలిటీల్లో తీవ్రంగా తాగునీటి సమస్య ఉందని సబితా తమ దృష్టికి తీసుకొచ్చిందని సీఎం అన్నారు. సబితా ఇంద్రారెడ్డి పుణ్యమా అని నగర శివారుల్లోని ప్రాంతాలన్నింటికి రూ.670కోట్ల వ్యయంతో నీటి కష్టాలు తీర్చడంతో పాటు రూ.వెయ్య కోట్లతో నాలాల పునరుద్దరణ చేశామన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితా నియోజకవర్గంలో ఇంటర్​, డిగ్రీ, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలతో మెడికల్​ కాలేజీల ఏర్పాటుతో ఎడ్యూకేషన్​ హాబ్​గా తీర్చిరాని సీఎం కేసీఆర్​ కొనియాడారు.

తుక్కుగూడలో 60 పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందని సీఎం అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతమైన కందుకూర్​ మండల పరిధిలో మెడికల్​ కాలేజీతో పాటు 450 పడుకల ఆసుపత్రిని ఏర్పాటుకు కృషి చేసిందన్నారు. ఈ విధంగా మహేశ్వరం నియోజకవర్గంలో తమదైన శైలిలో అభివృద్ధి చేసిందన్నారు. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నప్పటికి దర్పం లేకుండా క్రమశిక్షణగల సాధారణ వ్యక్తిగా ప్రజల్లో మమేకమై పనిచేస్తున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అని కితాబ్​ ఇచ్చారు. ఇలాంటి ఎమ్మెల్యేను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. వర్షం పడుతున్న వెనక్కి తగ్గకుండా సభకు హాజరైన ప్రజలను చూస్తే మహేశ్వరంలో సబితామ్మ గెలుపు ఖాయమైనట్లేనని సీఎం కేసీఆర్​ అన్నారు.

రూ.2వేల కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి.. బీఆర్​ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి సబితా ఇంద్రారెడ్డి

సీఎం కేసీఆర్​ నాయకత్వంలో నియోజకవర్గానికి రూ.2వేల కోట్ల నిదులు తీసుకొచ్చానని మహేశ్వరం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్ధి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం సంక్షేమం ప్రతి గడపకు అందించిన చరిత్ర కేసీఆర్​కే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి సీఎం అదనపు నిధులు ఇవ్వడంతోనే అభివృద్ధి సాధ్యమైయిందన్నారు. పట్టణ ప్రాంతంలోని కాలనీలు ముంపునకు గురైన ప్రజల సమస్యలు పరిష్కారించామన్నారు. విద్యా, వైద్యంతో పాటు ఇరుకైన రోడ్లను విస్తరించి అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కేసీఆర్​కు ముందోస్తుగా అభినందనలు తెలియజేస్తున్నాము.

Tags:    

Similar News