అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు అయినట్లు కడ్తాల్ సీఐ శివప్రసాద్ తెలిపారు.

Update: 2024-12-12 14:32 GMT

దిశ,ఆమనగల్లు ::- మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు అయినట్లు కడ్తాల్ సీఐ శివప్రసాద్ తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు... ఈ నెల 5న కడ్తాల్ మండలం పల్లె చెల్క తండా మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ మత్రు అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం ఇస్లావత్ మత్రును ఆమనగల్లు కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు.

హత్యాయత్నం కేసులో మరొకరు…

మాడ్గుల మండలం ఆర్కపల్లి గ్రామానికి చెందిన గౌర శ్రీశైలంపై అదే గ్రామానికి చెందిన బండ బీరయ్య, అతని కొడుకు బండ రాజులు ఈ నెల 10న హత్యాయత్నం చేశారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గురువారం నిందితులు బండ బీరయ్య, రాజులను ఆమనగల్లు కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్ఐ నాగరాజ్ తెలిపారు.


Similar News