దిశ, తాండూరు : మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాను విద్యార్థులు అవసరం మేరకే వినియోగించాలని, వాటి పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ.. బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, నేరాలను అరికట్టుట అందరి బాధ్యత అన్నారు. విద్యార్థులు ఫోన్లను అవసరమున్న మేరకు మాత్రమే వినియోగించాలని, దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. ఆపదలో ఉన్న సమయంలో షీటీం, పోలీసులు రక్షణగా నిలుస్తారని అన్నారు.డయల్ 181 లేదా 100కు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో షీటీం ఇంచార్జ్ శేఖర్, కాలేజీ ప్రిన్సిపల్ మల్లికార్జున్, అద్యాపకులు తదితరులు పాల్గొన్నారు.