తెలంగాణలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు కేసీఆర్ ఆనవాళ్లు ఎవరు చెరపలేరు : సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని కొందరు నాయకులు అంటున్నారని, తెలంగాణలో శాశ్వతంగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కేసీఆర్ పేరును ఎవరు చేరుప లేరని,
దిశ, మీర్ పేట్: తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని కొందరు నాయకులు అంటున్నారని, తెలంగాణలో శాశ్వతంగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కేసీఆర్ పేరును ఎవరు చేరుప లేరని, తెలంగాణ అంటేనే కేసీఆర్ గుర్తొస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యమ కారుల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కవి ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు హాజరై ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అమరుల త్యాగ ఫలమే అని వారిని స్మరించుకోవాలన్నారు. ఉద్యమ సమయంలో ఉద్యమకారుల పాత్ర చాలా గొప్పదన్నారు. రక్తం చుక్క కారకుండా శాంతి యుతంగా ఉద్యమ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని కేసీఆర్ ఆనాడు దేశంలో ,రాష్ట్రంలో అన్ని పార్టీల ను ఒక్క తాటి పైకి తెచ్చి తెలంగాణ రాష్ట్రన్ని సాధించడం కోసం బీజం వేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు. ఉద్యమంలో లేని చాలామంది నాయకులు కేసీఆర్ గురించి మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ యే శ్రీరామరక్షా అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో కొంత మంది ఉద్యమకారులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేశామన్నారు.
దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఉద్యమం సమయంలోనైనా ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా అమరవీరుల స్థూపానికి దండ పెట్టి ప్రారంభించేవారు అన్నారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అమరవీరుల స్థూపాన్ని దర్శించుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు కానీ చరిత్రలో నిన్ను ఉద్యమకారుడని ఎవరు గుర్తించారన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గేయాన్ని పాడిన రోజు రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకుల చెంతన ఉన్నాడని, ఆనాడు ఈ గేయాన్ని పాడి తెలంగాణ ప్రజలకు వివరించామని నేడు ఆ పాటకు ఏదో మేము కొత్తగా చేశామని సీఎం రేవంత్ చెప్పుకుంటున్నారు ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి ఆంధ్ర పాలకుల చేరలో ఉన్న రేవంత్ ఏనాడు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన దాఖలు లేవని ముఖ్యమంత్రి అయిన రేవంత్ కనీసం అమరవీరుల స్థూపాన్ని కూడా నివాళులర్పించలేడా అని ఆయన ప్రశ్నించాడు.
తెలంగాణ రాష్ట్రానికి చార్మినార్ ఒక దిక్సూచనీ,కాకతీయ చిహ్నాలాను చెరిపేయాలని తాపత్రయ పడుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన వ్యక్తి కేసీఆర్ అని ఈనాడు ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, యాదగిరిగుట్ట నీ అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయచితం శ్రీధర్, మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజిని సాయి చంద్,మహేశ్వరం నియోజవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ,మేయర్ యం దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్ పేట్, బడంగ్ పేట్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్కల కామేష్ రెడ్డి , రామిడి రామిరెడ్డి, కార్పొరేటర్లు ,బి అర్ ఎస్ నాయకులు,ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.