Rajiv Civils Abhaya Hastham: వీరికి రూ.లక్ష స్కీమ్ వర్తించదు.. సివిల్స్ అభయహస్తం అర్హతలు ఇవే!
సివిల్స్ అభయహస్తం అర్హతలు ఇవే!
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు ముగియడంతో పరిపాలనపై దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే రైతులకు రూ.2 లక్షల పంట రుణమాపీ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా శనివారం మరో స్కీమ్ ను స్టార్ట్ చేసింది. యూపీఎస్సీ సివిల్ ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం' పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సివిల్స్ పాసై మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాధ్యతలో భాగంగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేలా ఈ స్కీమ్ కు శ్రీకారం చుట్టారు. అయితే ఈ పథకానికి అర్హులు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి అర్హతలు ఇవే అంటూ సోషల్ మీడియాలో పత్రం సర్క్యులేట్ అవుతున్నది. దీని ప్రకారం.. ఈ స్కీమ్ అర్హతలు ఇలా ఉన్నాయి..
*జనరల్ (ఈడబ్ల్యూఎస్ కోటా)/బీసీ/ఎస్సీ/ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారై ఉండాలి
*అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి
*యూపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
*వార్షిక కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల లోపు మాత్రమే ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ
*రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు
*గతంలో ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొంది ఉండకూడదు
*అభ్యర్థులు వారి ప్రయత్నంలో ఒక్కసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది