Rain Alert: నేటి నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. అధికారుల కీలక సూచనలు!

రాష్ట్ర వ్యాప్తంగా రెండు, మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కుస్తున్నాయి.

Update: 2024-09-23 01:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా రెండు, మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కుస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతం (Bay of Bengal)లో కొనసాగుతోన్న ఆవర్తనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ (South Telangana) జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ (Rayalaseema) ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) తెలిపింది. అదేవిధంగా బంగాళాఖాతం (Bay of Bengal)లో సోమవారం ఏర్పడే అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి 26 వరకు అంటే మరో మూడు రోజు పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అశకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఐఎండీ అధికారులు (IMD officials) సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా జనగామ, సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ట్రాఫిక్ జామ్ (Traffic Jam)తో తీవ్ర ఇక్కట్లు పడ్డారు.


Similar News