Tirumala: తిరుమలలో శాంతి హోమం ప్రారంభం.. ఈవో శ్యామల రావు కీలక వ్యాఖ్యలు

తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో శాంతి హోమం (Shanthi Homam) ప్రారంభమైంది.

Update: 2024-09-23 03:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో శాంతి హోమం (Shanthi Homam) ప్రారంభమైంది. స్వామి వారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతి హోమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఆలయ ప్రాంగణంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటలకు శాంతి హోమం ప్రారంభమైంది. 10 గంటల వరకు హోమ క్రతువు ముగియనుంది. ఈ కార్యక్రమంలో ఈవో శ్యామల రావు (EO Shyamala Rao)తో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి (AEO Venkaiah Chowdary) పాల్గొన్నారు.

హోమం అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ (Panchagravya Samprokshana) క్రతువు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్యామల రావు మాట్లాడుతూ.. శ్రీవారి ప్రసాదంలో వినియోగించే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందని తెలిపారు. ఆ అపచారానికి ప్రాయశ్చిత్తంగానే ఇవాళ శాంతి హోమాన్ని నిర్వహిస్తు్న్నామని స్పష్టం చేశారు. హోమం కార్యక్రమం ముగిసిన వెంటనే అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేపడతామని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ (Tirumala Laddu) అపవిత్రమైనందున భక్తుల్లో విశ్వాసాన్ని నింపేందుకు శాంతి హోమం, పంచగ్రవ్య సంప్రోక్షణ క్రతువులను చేపట్టామని శ్యామలరావు వెల్లడించారు. 


Similar News